ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- August 14, 2026
కువైట్: అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తూ, ఇంటినే క్లినిక్‌గా మార్చి నిర్వహిస్తున్న అజర్‌బైజాన్‌కు చెందిన ఓ మహిళను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాబర్ అల్-అహ్మద్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. క్రిమినల్ సెక్యూరిటీ విభాగానికి చెందిన జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లోని యాంటీ-ఫోర్జరీ అండ్ కౌంటర్‌ఫీటింగ్ క్రైమ్స్ విభాగానికి సమాచారం అందింది. మహిళ తన ఇంటికి క్లయింట్లను పిలిపించుకుని డబ్బులు తీసుకుంటూ వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు, లైసెన్సులు లేకుండానే హెర్బల్ మిశ్రమాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు ఆమె నివాసంపై దాడి చేసి, వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే ఆమెను అరెస్ట్ చేశారు.
ఇంటినే పూర్తి క్లినిక్‌గా మార్చి..
ఆమె నివాసాన్ని పూర్తి స్థాయి వైద్య క్లినిక్‌గా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని హెర్బల్ మిశ్రమాలను తయారు చేయడానికి, వాటికి లేబుల్స్ సిద్ధం చేయడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దాడి సందర్భంగా KD 11,651 నగదు, వైద్య పరీక్షల పరికరాలు, వైట్ కోట్, రోగుల వివరాల రికార్డు పుస్తకం, హెర్బల్ మిశ్రమాల తయారీకి ఉపయోగించే పదార్థాలు, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ఆ మహిళ తన నివాసాన్ని లైసెన్స్ లేని వైద్య కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు అంగీకరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వైద్య సలహాలు, పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి KD 5 నుంచి KD 30 వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసులో మహిళపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







