సినిమా రివ్యూ: ‘విశ్వనాధ్ అండ్ సన్స్’
- August 14, 2026
‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా రూపొందింది. మమితా బైజు ఫీమేల్ లీడ్ పోషించింది. రాధికా శరత్ కుమార్, నాజర్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. మరి, సినిమా ఆకట్టుకునే విధంగా వుంటుందో లేదో తెలియాలంటే ‘కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
సంజయ్ విశ్వనాధ్ (సూర్య) ఓ పెద్ద బిజినెస్మెన్. షూటింగ్లో ఒలింపిక్స్ విన్నర్‌గా నిలుస్తాడు. తల్లి (రాధిక శరత్ కుమార్) అంటే ప్రాణం. కానీ, 42 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోడు. కొడుకు వారసత్వం నిలబడాలని తల్లి బాధపడుతుంటే, తట్టుకోలేక తల్లి కోసం అమెరికా వెళ్లి సరోగసీ పద్ధతిలో కొడుకును తీసుకొస్తాడు. ఆ బాబు వచ్చాకా ఆ ఇంట్లో సంతోషానికి అంతే వుండదు. కానీ, ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవదు. అనారోగ్యానికి గురైన ఆ బాబు ఆరోగ్యం కుదుటపడాలంటే, జన్మనిచ్చిన తల్లి మ్యాగీ (మమితా బైజు) అవసరం పడుతుంది. దాంతో, మళ్లీ అమెరికా వెళ్లి ఆమెని వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు సంజయ్. మరి, మ్యాగీ వచ్చాకా విశ్వనాధ్ జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయ్.? ఆ బాబు ఆరోగ్యం కుదుటపడిందా.? చివరికి ఈ కథ ఏ కంచికి చేరిందో తెలియాలంటే ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఇదో క్లాస్ సినిమా. ఈ క్లాస్ సినిమాకి హీరోగా సూర్య..సెలక్షన్ చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపూ సూర్య వయసులో వున్నప్పుడు చేసిన ‘గజిని’ సినిమాలోని సంజయ్ రామ స్వామి పాత్రే గుర్తుకొస్తుంటుంది. చాలా చక్కగా హ్యాండ్సమ్ లుక్స్‌లో కనిపిస్తాడు సూర్య ఈ సినిమాలో. అక్కడక్కడా కంపోజ్ చేసిన ఫైట్లు కూడా చాలా క్లాసీ టచ్‌తో డిజైన్ చేశాడు. వయసుకు తగ్గ లుక్సే కానీ, బెస్ట్ ఎవర్ లుక్స్‌లో సూర్య కనిపిస్తాడు ఈ సినిమాలో. నెక్స్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఈ సినిమాకి మమితా బైజు. ఈమె పాత్ర చిత్రీకరణకి సంబంధించి కూడా గతంలో అనేక పాత్రలు స్పురణకొస్తాయ్. కానీ, ఈ పాత్రలో మమితా చాలా చక్కగా ఒదిగిపోయింది. తన క్యారెక్టర్ అందరికీ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఆ తర్వాత రాధిక శరత్ కుమార్. తల్లి పాత్రలో తన అనుభవాన్ని రంగరించింది. నవ్వించింది. ఏడ్పించింది. సిగ్గు పడింది.. ఇలా చాలా రకాల భావోద్వేగాలు పండించారు రాధికా శరత్ కుమార్. నాజర్ పాత్ర కాసేసే అయినా ఆకట్టుకుంటారు. రవీనా టాండన్, సునీల్ రెడ్డి తదితర పాత్రలు వారి పరిధి మేర మెప్పిస్తాయ్.
సాంకేతిక వర్గం పనితీరు:
‘తొలిప్రేమ’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు రాశీఖన్నా పాత్రల్ని ఎంత డిగ్నిఫైడ్‌గా చిత్రీకరించాడో అదే విధంగా సూర్య ఏజ్‌కి తగ్గట్టుగా సూర్య పాత్రని, కథకి తగ్గట్లుగా మమితా బైజు పాత్రని చాలా అందంగా డిగ్నిఫైడ్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. 40 - 20 ఏజ్ రిలేటెడ్ కథలు గతంలో కొన్ని చూశాం. సో కథ పరంగా కొత్తేం లేదు. కానీ, కథనం నడిపించిన తీరు ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల కండోమ్ వంటి సున్నితమైన అంశాల్ని సైతం టచ్ చేశాడు. కానీ, నొచ్చుకోకుండా కన్విన్సింగ్‌గా ఆ సన్నివేశాల్ని తెరపై రక్తి కట్టించాడు. అలాంటి విషయాల్లో వెంకీ అట్లూరిని మెచ్చుకోకుండా వుండలేం. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీ అక్కడక్కడా గుర్తొస్తుంటాయ్. దాంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ప్రతీ ప్రేమ్ కూడా. మాటలు చాలా బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఇల్లు, ఇంట్లోని ఫర్నీచర్ ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లా అనిపిస్తుంది. జీవి ప్రకాష్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బాగా కుదిరింది. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. చాలా క్వాలిటీగా వుంటుంది సినిమా. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ గుడ్.
ప్లస్ పాయింట్స్:
ప్రధమార్ధంలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ఏజ్ రిలేటెడ్ సన్నివేశాలు, మాటలు, హాస్యం, ఇంటర్వెల్ బ్లాక్, సూర్య, మమితా బైజు పర్ఫామెన్స్ ఇంకా చాలా..
మైనస్ పాయింట్స్:
ప్రథమార్ధంలో కొన్ని సాగతీత సన్నివేశాలు.. బట్ నాట్ బ్యాడ్..
చివరిగా:
‘విశ్వనాధ్ అండ్ సన్స్’.. హాయిగా హ్యాపీగా ఫ్యామిలీతో ధియేటర్లలో చూడదగ్గ ఓ అందమైన ఆహ్లాదమైన కుటుంబ కథా చిత్రమ్.!
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







