కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- August 16, 2026
కువైట్ : ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సింగ్ నిబంధనలను కువైట్ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధీ 2026లోని మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 235ను జారీ చేశారు. ఇందులో ఫార్మసీల లైసెన్సుల పునరుద్ధరణ, బదిలీ, ప్రకటనలు, మందుల డెలివరీ తదితర అంశాలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
ఫార్మసీ ప్రస్తుత ప్రదేశానికి మొదటిసారిగా లైసెన్స్ జారీ చేసిన తేదీ ఆధారంగా.. లైసెన్స్ పునరుద్ధరణ లేదా ఫార్మసీ బదిలీకి ప్రాధాన్యం నిర్ణయించనున్నారు. ఫార్మసీ ముందు భాగంలో ప్రదర్శించే వాణిజ్య పేరు, లోగో, కలర్స్, ప్రచార కంటెంట్‌కు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. ఫార్మసీ ముఖభాగం, బయటి ప్రకటనల విషయంలో కూడా కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.
ఫార్మసీల నుంచి మెడిసిన్స్ ను డెలివరీ చేసే సేవలకు అనుమతి పొందేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మందుల డెలివరీ కోసం ఉపయోగించే వాహనం లేదా డెలివరీ సేవలు అందించే కాంట్రాక్ట్ సంస్థ నిర్దిష్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. పేషంట్ కు ఇచ్చే ప్రతి మందుల ప్యాకెట్‌పై పేషంట్ పేరు, మందులు ఇచ్చిన తేదీ, వినియోగించాల్సిన విధానం** వంటి వివరాలను లేబుల్‌పై స్పష్టంగా నమోదు చేయాలి.
మందుల నిల్వ, గడువు విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. గడువు ముగియడానికి 30 రోజుల కంటే తక్కువ సమయం ఉన్న మందులను విక్రయించకూడదు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందులకు మాత్రం ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. ఫార్మసీ నుంచి ఒకసారి మందులు తీసుకున్న తర్వాత వాటిని వినియోగదారులు తిరిగి ఇవ్వడానికి వీలుండదు.
ఫార్మసీల మూసివేతకు విధివిధానాలు
ఫార్మసీలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేసే సందర్భాల్లో పాటించాల్సిన విధివిధానాలను కూడా కొత్త నిర్ణయంలో స్పష్టంగా పేర్కొన్నారు. గడువు ముగిసిన మందులను సురక్షితంగా, నిబంధనల ప్రకారం పారవేయాల్సి ఉంటుంది. ఫార్మసీ ముఖభాగాలకు సంబంధించిన 2025లో జారీ చేసిన గత నిర్ణయాన్ని తాజా తీర్మానంతో రద్దు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్‌పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







