సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!

- August 16, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఆన్‌లైన్ గేమింగ్‌ సేవల నాణ్యత మెరుగుపడింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గేమ్‌లలో లేటెన్సీ రేట్లు 89 శాతం మెరుగుపడినట్లు కమ్యూనికేషన్స్‌, స్పేస్‌ అండ్‌ టెక్నాలజీ కమిషన్‌ (CST) వెల్లడించింది. CST విడుదల చేసిన ‘సౌదీ ఇంటర్నెట్‌’ నివేదిక ఐదో ఎడిషన్‌లో దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం, గేమింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT) రంగాలకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది.

ప్రముఖ గేమ్‌లలో లేటెన్సీ రేట్లు గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. టీమ్ ఫైట్ టాక్టిక్స్, లీగ్ ఆఫ్ లేజెండ్స్ (Teamfight Tactics, League of Legends) గేమ్‌లలో లేటెన్సీ 11 మిల్లీసెకన్లకు, మొబైల్ లెజేండ్స్ (Mobile Legends)లో 12 మిల్లీసెకన్లకు చేరింది. గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో స్మార్ట్‌ డివైజ్‌లు 22.1 శాతం వినియోగంతో మొదటి స్థానంలో ఉండగా, ప్లేస్టేషన్‌ 21.8 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచింది. గేమింగ్‌ ఫ్రీక్వెన్సీలో వారానికి ఒకసారి గేమ్స్‌ ఆడేవారు 32.1 శాతంతో ముందున్నారు. అప్పుడప్పుడు గేమింగ్‌ చేసే వారు 31 శాతం, ప్రతిరోజూ గేమ్స్‌ ఆడేవారు 29.2 శాతంగా ఉన్నారు.

1.38 కోట్లకు చేరిన ఐఓటీ సబ్‌స్క్రిప్షన్లు

సౌదీ అరేబియాలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT) వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఐఓటీ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య 13.85 మిలియన్లకు చేరినట్లు CST తెలిపింది. నారోబాండ ఇంటర్నెట్ థింగ్స్ (NB-IoT) ద్వారా పట్టణ ప్రాంతాల్లో జనాభా కవరేజీ దాదాపు 99 శాతానికి చేరింది. దేశంలోని ఇళ్లలో ఐఓటీ వినియోగం 18 శాతానికి చేరినట్లు తెలిపింది.

గేమింగ్‌, పరికరాల మధ్య కనెక్టివిటీపై ఆధారపడే అప్లికేషన్లు సహా పెరుగుతున్న ఇంటర్నెట్‌ వినియోగాన్ని ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా డిజిటల్‌ మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని CST పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలోనూ సౌదీ అరేబియా డిజిటల్‌ సామర్థ్యం మెరుగ్గా ఉందని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ITU) 2025 డిజిటల్‌ రెడీనెస్‌ ఇండెక్స్‌లో సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు CST వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com