వక్కంత వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ..

- August 17, 2016 , by Maagulf
వక్కంత వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ..

ఎన్టీఆర్‌ తన చిత్రాల వేగాన్ని పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'నాన్నకు ప్రేమతో' అంటూ అభిమానులను పలకరించగా, తాజాగా సెప్టెంబర్‌ 2న 'జనతా గ్యారేజ్‌'తో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్‌ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇక రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభంకానుందట. వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్‌ పచ్చజెండా వూపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తికావచ్చాయని సమాచారం. గతంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన అశోక్‌, వూసరవెల్లి, టెంపర్‌ చిత్రాలకు వంశీనే రచయితగా పనిచేశారు. తాజా చిత్రాన్ని ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com