'పంచతంత్రం' సీక్వెల్
- August 17, 2016
కమల్‌హాసన్ నటించిన 'పంచతంత్రం' సినిమా గుర్తుందా? కమల్ అతని నలుగురు స్నేహతులు కలిసి చేసే అల్లరితో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రమది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతుందట.
కమల్‌హాసన్.. సిమ్రాన్.. రమ్యకృష్ణ నటించిన 'పంచతంత్రం' 2002లో విడుదలై ఘన విజయం సాధించింది. . ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని కె.ఎస్ రవికుమార్ చాలాసార్లు భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది నిర్మాణ దశకు చేరుకోలేదు. తాజాగా 'పంచతంత్రం' చిత్రానికి సీక్వెల్ తీయనున్నట్టు రవికుమార్ ప్రకటించారు.
కమల్ హాసనే స్వయంగా ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సింగిల్‌లైన్ కథను చెప్పారట. త్వరలో స్క్రిప్టు పూర్తి చేసి సెట్స్‌పైకి తీసుకెళ్తారట. మొదటి చిత్రంలో కమల్.. అతని స్నేహితులు వారి భార్యలకు తెలియకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సీక్వెల్‌లో కథంతా ఈ ఐదుగురు భర్తలపై ప్రతీకారం తీర్చుకునే భార్యల చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు.
మరి ఈ చిత్రంలో కమల్ సరసన ఎవరు నటిస్తారు? స్నేహితులుగా.. వారి భార్యలుగా మొదటి చిత్రంలో ఉన్నవాళ్లనే కొనసాగిస్తారా? మార్పులు చేస్తారా.. అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







