ధోఫార్‌లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!

- August 19, 2026 , by Maagulf
ధోఫార్‌లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!

మస్కట్: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో అన్నాచెల్లెలు మృతి చెందారు.

మృతులను కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్బానీ, ఆయన సోదరిగా గుర్తించారు. సలాలాలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ (OASC) వెల్లడించింది.

ఈ ఘటనపై OASC తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్బానీ, ఆయన సోదరి మృతికి సంతాపం తెలిపింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, సహనం ప్రసాదించాలని ప్రార్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com