సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!

- August 19, 2026 , by Maagulf
సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!

జాజాన్: సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన యెమెన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను తరలిస్తున్న సౌదీ పౌరుడిని జాజాన్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ముజాహిదీన్‌కు చెందిన పెట్రోలింగ్ బృందాలు ఈ చర్య తీసుకున్నాయి. అరెస్టైన సౌదీ పౌరుడిని తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించగా, సరిహద్దు చట్ట ఉల్లంఘనదారులైన ఇద్దరు యెమెన్ పౌరులను సంబంధిత అధికారుల ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు సహకరించడం, వారికి రవాణా సౌకర్యం కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం లేదా ఏ రూపంలోనైనా సహాయం చేయడం తీవ్రమైన నేరమని ముజాహిదీన్ అధికార ప్రతినిధి హెచ్చరించారు.

ఇలాంటి నేరాలకు గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష, SR10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల పేర్లను బహిరంగంగా ప్రకటించే శిక్ష కూడా ఉంటుందని పేర్కొన్నారు.

రెసిడెన్సీ, కార్మిక, సరిహద్దు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఫిర్యాదు చేసిన వారిపై ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com