గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం

- August 19, 2026 , by Maagulf
గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం

అమరావతి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాల పై జగన్ విమర్శలు
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రమవుతోందని, ఆ ప్రజా ఆగ్రహాన్ని కప్పిపుచ్చేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల దృష్టిని వేరే అంశాలపైకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com