156మంది భారతీయులను సంకట్ మోచన్ ఆపరేషన్ పేరిట సురక్షితం...
- August 17, 2016
భారత్ పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది. సంకట్ మోచన్ పేరిట తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు భారత ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసం అద్భుతం అని అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ డెడోరా లీ జేమ్స్ అన్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న ఆమె సౌత్ సుడాన్ లో ఇబ్బందుల్లో పడిన భారతీయులను తమ దేశం నుంచి కొనుగోలు చేసిన భారీ యుద్ద విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్ ద్వారా సురక్షితంగా తిరిగి తమ మాతృదేశంలోకి సురక్షితంగా చేర్చగలిగారని కొనియాడారు.ఈ సందర్భంగా భారత్ ను అభినందించకుండ ఉండలేకపోతున్నానని చెప్పారు. త్వరలోనే స్వయంగా తాను వెళ్లి మరోసారి భారత్ కు ఈ విషయంలో అభినందనలు చెబుతానని చెప్పారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దక్షిణ సుడాన్ లో సంకంటంలో పడిన 156మంది భారతీయులను సంకట్ మోచన్ ఆపరేషన్ పేరిట సురక్షితంగా గత నెలలో తిరిగి తీసుకొచ్చింది.భారత్ వైమానిక దళం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని, ఇరు దేశాల మధ్య గతంలో ఆగిపోయిన పలు కార్యక్రమాలు తన పర్యటనతో తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. ఇరు దేశాల సైనికులకు ఉమ్మడి శిక్షణ, కొన్ని ఆపరేషన్లలో కలిసి పనిచేయడం, ప్రమాదాలు ఎదుర్కోవడం వంటివి చేస్తామని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









