విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- August 24, 2026
మనామా: బహ్రెయిన్‌లోని కొన్ని విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజుల వసూళ్లు, వాణిజ్య రిజిస్ట్రేషన్ల నిర్వహణపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని ఎంపీ బసీమా ముబారక్ సంబంధిత అధికారులను కోరారు. కొన్ని విద్యా సంస్థల చట్టపరమైన స్థితిని పరిశీలించడంతో పాటు, అవి అందిస్తున్న విద్యా కార్యకలాపాలు వాటికి మంజూరైన లైసెన్సుల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేయాలని ఆమె సూచించారు. అలాగే విద్యార్థుల నుంచి ఫీజులు ఎవరు వసూలు చేస్తున్నారో పరిశీలించాలని కోరారు. బహ్రెయిన్ పౌరుల పేర్లపై నమోదైన కమర్షియల్ రిజిస్ట్రేషన్లు (CR) ఇతరులు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై కూడా తనిఖీలు అవసరమని పేర్కొన్నారు.
అరాద్లోని ఓ విద్యా సంస్థకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిన ముబారక్.. ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు లైసెన్సులో పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించాలని కోరారు. ఫీజులు వసూలు చేస్తున్న వ్యక్తులు చట్టబద్ధంగా అనుమతి పొందారా? నిబంధనలను పాటిస్తున్నారా? అనే అంశాలను కూడా తనిఖీ చేయాలని కోరారు. ముహర్రక్ గవర్నరేట్‌లోని మరో విద్యా సంస్థ కూడా ఈ తనిఖీల పరిధిలోకి వస్తుందని ముబారక్ తెలిపారు. సంస్థ ప్రాంగణాన్ని పరిశీలించి, లైసెన్సును పరిశీలించాలని కోరారు.
బహ్రెయిన్ పౌరుల పేర్లపై ఉన్న కమర్షియల్ రిజిస్ట్రేషన్లను ఇతరులు ఉపయోగిస్తున్నారనే నివేదికలపై ముబారక్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇలాంటివి ఏవైనా ఉంటే, బహ్రెయిన్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







