గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- August 25, 2026
గుడివాడ: గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక సీటీ స్కాన్ యంత్రంతో పాటు సోలార్ పవర్ సదుపాయాన్ని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.
స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ బాలశౌరి ఈ సదుపాయాలను ప్రారంభించారు.గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1.85 కోట్ల వ్యయంతో సీటీ స్కాన్ యంత్రాన్ని, రూ.76.60 లక్షల వ్యయంతో సోలార్ పవర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ప్రజలకు లభిస్తుందని పేర్కొన్నారు.
అదేవిధంగా సోలార్ పవర్ సదుపాయం ద్వారా ఆసుపత్రి విద్యుత్ అవసరాల్లో కొంత భాగాన్ని సౌర విద్యుత్‌తో తీర్చుకోవడంతో పాటు నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







