ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- August 27, 2026
దోహా: ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మూడు కొత్త పబ్లిక్ పార్కులను ప్రారంభించింది. అల్ వక్రా, అల్ వుకైర్ ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ప్రారంభించిన పార్కుల్లో అల్ వక్రాలో అల్ మష్మూమ్ పార్క్, అల్ ఖుజామా పార్క్, అల్ వుకైర్లో అల్ అరాక్ పార్క్ ఉన్నాయి.
మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ పార్క్స్ విభాగం, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) సమన్వయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ పార్కులను అభివృద్ధి చేసింది. స్థానిక పర్యావరణానికి అనుబంధమైన మొక్కల పేర్లను ఈ మూడు పార్కులకు పెట్టారు.
మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ పబ్లిక్ సర్వీసెస్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఇంజినీర్ అబ్దుల్లా అహ్మద్ అల్ కరానీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పార్కులు, వినోద ప్రదేశాలను విస్తరించడంలో భాగంగానే కొత్త పార్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు, సదుపాయాలు అందించడమే లక్ష్యమన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కులను రూపొందించినట్లు చెప్పారు. పచ్చని ప్రదేశాలతో పాటు వ్యాయామం, నడక, విశ్రాంతి కోసం సదుపాయాలు కల్పించామని, ఆరోగ్యకరమైన జీవనశైలిని, బహిరంగ ప్రదేశాల్లో శారీరక చురుకుదనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
పబ్లిక్ పార్క్స్ విభాగం డైరెక్టర్ మహ్మద్ ఇబ్రహీం అల్ సదా మాట్లాడుతూ.. ఇవి స్థానిక ప్రజల అవసరాలను తీర్చే నైబర్‌హుడ్ పార్కులని తెలిపారు. స్పోర్ట్స్ సదుపాయాలు, వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, రెస్ట్రూమ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







