ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్: అబ్రాజ్ కుడియా
- August 18, 2016
10 వేల గదులతో అతి పెద్ద హోటల్ని ఊహించుకోగలమా? అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది సౌదీ అరేబియా. వచ్చే ఏడాది ఈ హోటల్ని ప్రారంభించనుంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనంలో ప్రస్తుతం అనేక హంగుల్ని అమర్చే పని జరుగుతోంది. ఈ పెద్ద హోటల్ పేరు అబ్రాజ్ కుడియా. ఇందులో 10 వేల గదులు అత్యంత విలాసవంతంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటికైతే 7,351 గదులతో మలేసియాలోని జెంటింగ్ హైలాండ్స్ అనే హోటల్ సేవలు అందిస్తోంది. ఆ రికార్డుల్ని అబ్రాజ్ కుడియా బ్రేక్ చేయనుంది. 45 అంతస్తులతో ఈ హోటల్ని నిర్మించారు. ఇందులో 12 టవర్స్ ఉంటాయి. 10 అంతస్తుల పోడియం కూడా ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా వచ్చే యాత్రీకులకు వీలుగా టవర్లపై హెలిప్యాడ్స్ని ఏర్పాటు చేశారు. ఇందులో సౌదీ రాయల్ ఫ్యామిలీ కోసం 5 అంతస్తుల్ని ప్రత్యేకంగా కేటాయించారు. 4 హెలిప్యాడ్లు, 70 రెస్టారెంట్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణ. 3.5 బిలియన్ల ఖర్చుతో ఈ హోటల్ని నిర్మించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







