షార్జా - కస్బాలో ఎలక్ట్రికల్ వెహికిల్ ఛార్జింగ్ సిస్టమ్
- August 18, 2016
షార్జా లీజర్ ల్యాండ్‌స్కేప్ అల్ కస్బా ఇక నుంచి మరింత పర్యావరణ హితంగా ఉండనుంది. రెండు ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్లను అల్ కస్బాలో ఏర్పాటు చేశారు. ఎమిరేట్స్ గ్రీన్ పార్కింగ్ ఇనీషియేటివ్‌లో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమిరేట్‌లో ఎకో ఫ్రెండ్లీ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ ఛార్జింగ్ పాయింట్లు, ఎలక్ట్రిక్ కార్స్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. అల్ కస్బా మేనేజర్ సుల్తాన్ మొహమ్మద్ షతాఫ్ మాట్లాడుతూ, ముందు ముందు ఈ చార్జింగ్ స్టేషన్స్‌ని ఇంకా పెంచుతామని తెలిపారు. బిఎండబ్ల్యు ఐ8 వాహనాల్ని బ్లాక్ ఎలో ఒకటి, బ్లాక్ డిలో ఇంకొకటి చార్జింగ్ చేశారు. వాహనాలు చార్జింగ్ పాయింట్స్ వద్ద ఎలా పనిచేస్తాయో తెలిపేలా ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అల్ కస్బాలో రెస్టారెంట్లు, కేఫ్‌లు, కిడ్స్ ఫన్ జోన్, అల్ కస్బా మ్యూజికల్ ఫౌంటెయిన్, ఐ ఆఫ్‌ది ఎమిరేట్స్ ఫెరిస్ర్ వీల్, మరయా ఆర్ట్ సెంటర్ వంటి సౌకర్యాలతో పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







