ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- August 30, 2026
మస్కట్: ఒమన్‌లో భారీగా మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధోఫార్ గవర్నరేట్ పోలీసుల సహకారంతో డైరెక్టరేట్ జనరల్ ఫర్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యెమెన్ జాతీయులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అనంతరం నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
అరెస్టయిన ఇద్దరిపై ఒమన్ చట్టాల ప్రకారం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







