చిరంజీవి 150వ సినిమా ఫస్ట్‌లుక్ ఆగస్ట్ 22న...
- August 19, 2016
దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. ఇది చిరంజీవి 150వ సినిమా కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకే చిరంజీవి అండ్ కో సకల జాగ్రత్తలూ తీసుకుని తమిళ 'కత్తి'ని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్ట్ 22న విడుదల చేయనున్నారు. ఆ విషయం తెలియజేయడానికి గురువారం రాత్రి ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే అందులో కూడా ఈ సినిమా పేరేంటన్నది వెల్లడించలేదు. కేవలం 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' అనే బ్యానర్‌ను, హైదరాబాద్ సింబల్స్ అయిన చార్మినార్, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట చూపించారు.
ఈ సినిమా పేరేంటో తెలియాలంటే ఆగస్ట్ 22వ తేదీ వరకు ఆగక తప్పదన్నమాట
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







