షార్జా వాటర్ పార్కులో మూడేళ్ళ బాలుడు నీట మునక
- August 19, 2016
షార్జ: ఆహ్లాదం కోసం పార్కుకి వచ్చి తమ తమ వ్యవహారాల్లో నిమగ్నమైన ఆ తల్లితండ్రులు తమ మూడేళ్ళ బాబుని మరచిపోవడంతో ఆ చిన్నారి బుడి బుడి అడుగులతో నీట మడుగు వైపు వెళ్లి అందులో పడిపోయాడు. ఈ విషాదకర ఘటన షార్జాలో అల్ ముంతాజాహ్ పార్కులోని వాటర్ పార్కు వద్ద బుధవారం జరిగింది. అక్కడ మూడేళ్ళ బాలుడు నీట మునిగిపోవడంతో రక్షించిన స్థానికులు తరువాత అల్ ఖ్అసిమి హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ ప్రస్తుతం చావు బతుకుల మద్య ఆ పసి ప్రాణం పోరాడుతోంది. ఎం.ఎస్.ఎస్. గా గుర్తించబడిన ఆ బాలుడు అల్ ఖ్అసిమి హాస్పిటల్ అత్యవసర విభాగంలో బుధవారం రాత్రి 7.50 సమయంలో చేర్పించారు ఆ పిల్లవాడు కాలు జారీ నీటిలో పడిపోయాడు. ఆ బాలుని కుటుంబం అది గమనించే సరికి నీటిలో మునకలువేస్తున్న స్థితిలో వారు గమనించారు. తేరుకున్న తల్లితండ్రులు యుఎఇ లోని అల్ ఖ్అసిమి ఆసుపత్రిలో మూడేళ్ళ బాలుడిని చేర్పించారు. అయితే , వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఇది తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనబడుతుందని షార్జా పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అల్ బుహారః పోలీసులు ఈ సంఘటన గూర్చి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







