డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- September 04, 2026
రియాద్: ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు, రిటైల్ అవుట్‌లెట్లలో 20 వేలకుపైగా తనిఖీలు నిర్వహించినట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది డిస్కౌంట్‌లకు సంబంధించిన నిబంధనలను వ్యాపార సంస్థలు పాటిస్తున్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్టు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 2026 వాణిజ్య డిస్కౌంట్ సీజన్ ప్రారంభం కావడంతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపింది. ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమైన ఈ డిస్కౌంట్ సీజన్ అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది. తనిఖీల సందర్భంగా డిస్కౌంట్ అనుమతిపత్రాలు చెల్లుబాటులో ఉన్నాయా, వాటిని వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శిస్తున్నారా అన్న అంశాలను అధికారులు పరిశీలించారు.
అలాగే, అనుమతించిన డిస్కౌంట్ శాతాలనే అమలు చేస్తున్నారా, ఉత్పత్తుల ధరలను ట్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ ప్రైస్ రీడర్లపై స్పష్టంగా చూపిస్తున్నారా అనే విషయాలను తనిఖీ చేశారు. వస్తువుల రిటర్న్, ఎక్స్ఛేంజ్ విధానాలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేస్తున్నారా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించారు.
డిస్కౌంట్ ఆఫర్లపై వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది. దుకాణాల్లో ప్రదర్శించే డిస్కౌంట్ అనుమతిపత్రాలపై ఉన్న అధికారిక బార్‌కోడ్‌ను స్కాన్ చేసి, డిస్కౌంట్ వివరాలు, శాతం, ఆఫర్ గడువు, సంబంధిత సంస్థ వివరాలను తనిఖీ చేసుకోవాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







