ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- September 05, 2026
న్యూఢిల్లీ: ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా నియమితులైన డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసి తన నియామక పత్రాలను సమర్పించారు. రాష్ట్రపతిని కలిసి క్రెడెన్షియల్స్ అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల పేర్కొన్నారు.
భారత్–ఖతార్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్రపతి అందించిన విలువైన మార్గదర్శకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
భారత్–ఖతార్ సంబంధాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, సాంస్కృతిక సహకారం తదితర రంగాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల నియామకానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







