దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..

- September 05, 2026 , by Maagulf
దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..

దోహా: ఖతార్ కు భారత రాయబారిగా నియమితులైన డాక్టర్ శ్రీకర్ రెడ్డి దోహాకు చేరుకున్నారు. భారత కొత్త రాయబారిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన శనివారం దోహా చేరినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

దోహా విమానాశ్రయంలో భారత రాయబారి కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ సందీప్ కుమార్, కతార్ విదేశాంగ శాఖ ప్రోటోకాల్ డైరెక్టర్ అంబాసిడర్ ఇబ్రహీం యూసుఫ్ ఫఖ్రోతో కలిసి డాక్టర్ శ్రీకర్ రెడ్డికి స్వాగతం పలికారు.

కొత్త రాయబారికి ఘన స్వాగతం పలికిన అంబాసిడర్ ఇబ్రహీం ఫఖ్రోకు భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

భారత్–ఖతార్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న సన్నిహిత, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు డాక్టర్ శ్రీకర్ రెడ్డి పదవీకాలంలో కృషి చేయనున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు పరస్పర సహకారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు భారత రాయబార కార్యాలయం ముందుకు సాగుతుందని తెలిపింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com