రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!

- September 05, 2026 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!

మనామా: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందడంతో బహ్రెయిన్‌ విద్యాశాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అరాద్ బాలుర ప్రిపరేటరీ పాఠశాలలో చదువుతున్న అహ్మద్ ఒసామా అదెల్ ఖమీస్ జమాన్ డ్రై డాక్ రోడ్డుపై జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో మృతి చెందినట్లు విద్యాశాఖ తెలిపింది.

విద్యార్థి మృతిపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ ముబారక్ జుమా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పాఠశాల వర్గాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి విద్యాశాఖ అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మృత విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు స్వర్గంలో స్థానం కల్పించాలని ప్రార్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com