యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!

- September 06, 2026 , by Maagulf
యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!

దుబాయ్:యూఏఈ లాటరీ శనివారం రాత్రి నిర్వహించిన లక్కీ డే డ్రా ఫలితాలను ప్రకటించింది. మొత్తం 3,996 మంది విజేతలు నగదు బహుమతులు గెలుచుకున్నారు. ఇందులో ఇద్దరు విజేతలు Dh100,000 చొప్పున భారీ బహుమతి అందుకున్నారు.డ్రాలో వచ్చిన ఆరు ప్రధాన నంబర్లు 4, 7, 20, 21, 22, 25 కాగా, లక్కీ మంత్ నంబర్ 1 గా ఉంది.

ఆరు విజేత నంబర్లలో ఐదు నంబర్లతో పాటు లక్కీ మంత్ నంబర్‌ను సరిపోల్చిన ఇద్దరు పాల్గొనేవారు Dh100,000 చొప్పున గెలుచుకున్నారు.  మరో 39 మంది ఒక్కొక్కరు Dh1,000 చొప్పున గెలుచుకోగా.. వివిధ నంబర్ కాంబినేషన్లను సరిపోల్చిన 3,952 మంది ఒక్కొక్కరు Dh100 చొప్పున అందుకున్నారు. అన్ని ఆరు ప్రధాన నంబర్లతో పాటు లక్కీ మంత్ నంబర్‌ను కూడా సరిగ్గా సరిపోల్చాల్సిన Dh30 మిలియన్ గ్రాండ్ ప్రైజ్ ఈసారి ఎవరికీ దక్కలేదు.

అలాగే ఆరు ప్రధాన నంబర్లను మాత్రమే సరిపోల్చిన వారికి లభించే Dh5 మిలియన్ సెకండ్ ప్రైజ్ కూడా ఎవరూ గెలుచుకోలేదు. లక్కీ ఛాన్స్ డ్రాలో మరో ముగ్గురు విజేతలు (ఐడీలు AY2359201, AF0415233, AM1115527) ఒక్కొక్కరు Dh50,000చొప్పున గెలుచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com