పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!

- September 08, 2026 , by Maagulf
పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!

హూరా: విధి నిర్వహణలో ఉన్న పోలీసు సార్జెంట్‌పై దాడి చేసిన కేసులో ఒక నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఘటన 2026 ఫిబ్రవరి 17న హూరా ప్రాంతంలో చోటుచేసుకుంది. అధికారులు నిందితుడు అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో నిందితుడు పోలీసులపై అరుస్తూ, వారిని మాటలతో దూషించినట్లు సమాచారం.

అనంతరం అతడికి హ్యాండ్ కఫ్స్ వేసి పోలీసు పెట్రోల్ వాహనంలో కూర్చోబెట్టగా, నిందితుడు వాహనం కిటికీని తన్నాడు. అతడిని అదుపు చేసేందుకు పోలీసు సార్జెంట్ ప్రయత్నించగా, నిందితుడు సార్జెంట్ ముఖం, భుజం, ఛాతీపై మూడుసార్లు తన్నినట్లు కేసు వివరాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసు అధికారిని దూషించి, అతడిపై ఉమ్మివేసినట్లు తెలిపారు.

పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు పోలీసు అధికారిపై దాడి చేసినట్లు అంగీకరించాడు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం, నిందితుడిని అదుపు చేసే సమయంలో సార్జెంట్ చిటికెన వేలికి గాయమైంది. ఈ కేసులో నిందితుడికి ఏప్రిల్ 28న గైర్హాజరీలో మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అనంతరం మే 7న అతడి న్యాయవాది తీర్పుపై అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి తీర్పు కోసం సెప్టెంబర్ 29కు వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com