యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- September 09, 2026
మస్కట్: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణను వ్యతిరేకిస్తూ పలు యూరోపియన్ దేశాల విదేశాంగ మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను ఒమన్ స్వాగతించింది. యునైటెడ్ కింగ్డమ్, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఐర్లాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం అక్రమంగా పరిగణించే ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు సంబంధించిన వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల నిరంతర విస్తరణ అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ఉల్లంఘన అని పేర్కొంది. పాలస్తీనా ప్రజలకు న్యాయమైన, సమగ్ర శాంతి సాధించే దిశగా 1967 జూన్ 4 సరిహద్దుల ఆధారంగా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అంతర్జాతీయ సమాజం గట్టి చర్యలు తీసుకోవాలని ఒమన్ కోరింది. అలాగే ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ విధానాలను అడ్డుకునేందుకు మరింత ఆచరణాత్మక, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!
- అరబ్ రీడింగ్ ఛాలెంజ్..అక్టోబర్ 29న దుబాయ్‌లో తుది వేడుకలు..!!
- భారత్-కువైట్ దౌత్య సంబంధాలకు 65 ఏళ్లు.. మొక్కలు నాటిన భారతీయులు..!!
- తెలంగాణ టీజీ ఐపాస్ పై సైబర్ దాడి
- భద్రతా మండలిలో వీటో అధికారాలపై ఆంక్షలు విధించాలి..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఆరోగ్య బీమా నిబంధనలు..!!
- ఒమన్‌లో కార్మికుల నివాసాలపై ఆంక్షలు..!!
- రక్షణ రంగంలో తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
- సౌదీ అరేబియాలో క్షిపణుల అవశేషాలు..మక్కా, జెడ్డా, తాయిఫ్‌లో పడిన శకలాలు
- అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ







