కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!

- September 09, 2026 , by Maagulf
కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!

కువైట్: కువైట్‌లో 54 ఏళ్ల భారతీయ నర్సు మృతి చెందారు. కేరళలోని చెంగన్నూర్‌కు చెందిన షైనీ థామస్ సోమవారం రాత్రి అబ్బాసియాలోని తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.

షైనీ థామస్‌ కువైట్‌లోని జహ్రా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త మనోజ్ ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా, వారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

షైనీ మృతదేహాన్ని కువైట్‌ నుంచి భారత్‌కు తరలించేందుకు అవసరమైన ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆమె ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com