సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- September 09, 2026
కువైట్: ప్రభుత్వ సబ్సిడీతో అందించే డీజిల్‌ను చోరీ చేసి, సేకరించి, రవాణా చేసి అక్రమంగా విక్రయిస్తున్న రెండు వేర్వేరు కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది.
మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి కేసులో 8 ట్యాంకర్లు, ట్రక్కులను, రెండో కేసులో 13 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో కొన్ని ట్యాంకర్ల యజమానులు తమ వాహనాలను ‘ఇన్‌క్లూజన్ సిస్టమ్’ కింద అద్దెకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఆ వాహనాలను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న విషయం వారికి తెలిసినప్పటికీ వాటిని అందుబాటులో ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో చోరీ చేసిన సబ్సిడీ డీజిల్‌ను సేకరించడం, రవాణా చేయడం, అక్రమంగా విక్రయించడం వంటి కార్యకలాపాలకు వాహనాల యజమానులు సహకరించినట్లు అధికారులు తెలిపారు. యాక్టింగ్ ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ దేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ నిధులు, రాష్ట్ర వనరులను పరిరక్షించడంతో పాటు ఇలాంటి నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
నేరాలకు పాల్పడేందుకు యంత్రాలు, పరికరాలను ఉపయోగించే వారిపైనే కాకుండా.. అవి నేరాలకు ఉపయోగించబడుతున్నాయని తెలిసినా వాటిని అందుబాటులో ఉంచే వారిపైనా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ వనరుల పరిరక్షణ, చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







