400 మిలియన్‌ డాలర్లు చెల్లించనున్న అమెరికా ..

- August 20, 2016 , by Maagulf
400 మిలియన్‌ డాలర్లు చెల్లించనున్న అమెరికా ..

 ఇరాన్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నలుగురు అమెరికన్‌ ఖైదీల విడుదలకు రంగం సిద్ధం చేసినట్టు అమెరికా కార్యదర్శి జాన్‌ కిర్బీ వెల్లడిం చారు. అయితే, ఆ ఖైదీల విడుదల కోసం తాము 400 మిలియన్‌ డాలర్ల ( రూ. 2,685 కోట్లు) మొత్తాన్ని ఇరాన్‌కు చెల్లించాల్సి ఉంటోందని చెప్పారు. అమెరికా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఇరాన్‌ ఖైదీలను విడుదల చేసినట్టయితే, తమ జైళ్లలో ఉన్న నలుగురు ఖైదీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ పేర్కొంది. ఈ మేరకు జనవరి17న ఇరుదేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అంతేగాకుండా, గతేడాది జూలైలో అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఖైదీల విడుదల విషయంలో ఇరుదేశాలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. కాగా, జైళ్లలో ఉన్న నలుగురు అమెరికన్‌ ఖైదీలు టెహ్రాన్‌ నుంచి అమెరికాకు చేరినప్పుడే పూర్తి చెల్లింపు చేస్తామని అమెరికా షరతు పెట్టడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com