వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!
- September 10, 2026
న్యూ ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం వెన్నెముక. ప్రజల పొదు వులను సమీకరించి ఉత్పాదక రంగా లకు మూలధనంగా మళ్లించడం, నగదు లావాదేవీలను సురక్షితంగా నిర్వ హించడం, పెట్టుబడులకు ఊత మివ్వడం, ప్రభుత్వ సంక్షేమపథకాల అమలులో భాగస్వామ్యం కావడం వంటి అనేక కీలక బాధ్యతలను బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ఒక ప్పుడు బ్యాంకు సేవలు ప్రధానంగా నగరాలకే పరిమితమైతే, నేడు గ్రామీణ ప్రాంతాల వరకు వీటి సేవలు విస్తరించాయి. దేశంలో ప్రతీ పదిమందిలో సగటున 8 మంది బ్యాంకింగ్ సేవలు పొందుతున్నవారే. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన తర్వాత బ్యాంకింగ్ సేవలు తప్పని సరిగా, మరింత వేగవంతగా మారాయి. డిజిటల్ సాంకేతికతతో బ్యాంకింగ్ సేవలు మొబైల్ ఫోన్లోకి వచ్చా యి. అయితే ఈ సౌలభ్యాల వెనుక వినియోగదారులపై రోజురోజుకూ పెరుగుతున్న వివిధ రకాల రుసుములు (చార్జీలు) తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బ్యాంకు చార్జీల గణాంకాలు చూసి దేశంలో సగటు మనిషి ఒకింత అసహనానికి గురిఅయ్యారు. ప్రజల డబ్బును భద్రపరచే బ్యాంకులే అదే ప్రజలపై అనవసరపు చార్జీల భారం మోవడం సమంజసమేనా అనే ప్రశ్న నేడు మరింత బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం బ్యాంకులు వివిధ పేర్లతో వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నా యి. కనీస నిల్వ నిర్వహించలేదని జరిమానా, నిర్ణీత పరి మితికి మించి ఏటీఎం లావాదేవీలకు చార్జీలు, డెబిట్కార్డుల వార్షిక రుసుములు, చెక్బుక్ ఫీజులు, ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలు, నగదు జమ లేదా ఉపసంహరణ పరిమితిని దాటి తే అదనపు రునుములు, ఖాతా నిర్వహణ చార్జీలు ఇలా వివిధ రకాల చార్జీలతో బ్యాంకులు ఖాతాదారుడి జోబుకు కన్నం వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడిం చిన తాజా వివరాల ప్రకారం, గత 4 ఆర్ధిక సంవత్సరాల లో దేశంలోని బ్యాంకులు వినియోగదారుని బ్యాంకు ఖాతా ల్లో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) ఉంచనందుకు పెనాల్టీ ద్వారా సుమారు రూ.26,190 కోట్లు వసూలు చేశాయి. కేవలం ఒక్క 2025-26 ఆర్ధిక సంవత్సరంలోనే బ్యాంకులు సుమారు రూ.7,086 కోట్లు వరకు పెనాల్టీలను వినియోగదారుల నుండి వసూలు చేశాయి. ఇందులో మొత్తం 19 (ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారుల నుండి రూ.4,948.71 కోట్లు వసూలు చేయగా దేశంలోని 12 ప్రభుత్వ బ్యాంకులు 2,137.92 కోట్లవరకు వసూలు చేసాయి. వీటి లో కొన్ని బ్యాంకులు కేవలం కరెంటు ఖాతాలమీద పెనాల్టీ లు వసూలు చేస్తే. మరికొన్ని సేవింగ్ కరెంటు ఖాతాలమీద కలిపి పెనాల్టీలు వసూలు చేశాయి. ఇక ప్రైవేట్ రంగబ్యాంకు లలో అత్యధికంగా ఒక ప్రముఖ బ్యాంకు 1,798.14 కోట్లు వసూలు చేయగా మరో బ్యాంకు 1,08133 కోట్లు వసూలు చేసింది. మొత్తం 19 ప్రైవేట్ బ్యాంకులు వసూలు చేసిన పెనాల్టీలలో కేవలం ఈ రెండు బ్యాంకులు వసూలు చేసిన పెనాల్టీలు విలువ సుమారు 58 శాతం.
ఎస్ఎంఎస్ చార్జిల రూపంలో వేలకోట్ల
2022-2026 ఆర్ధిక నవత్సరం వరకుఅంటే మొత్తం నాలుగు ఆర్ధిక సంవ త్సరాలలో ‘కనీస సగటు బ్యాంకు బాలెన్స్’ నిర్వహించని కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్స్ నుండి వసూలు చేసిన పెనాల్టీలు సుమారు 10,230.75 కోట్లు. ఇక ప్రైవేట్రంగ బ్యాంకులు గత నాలుగేళ్లలో సుమారు 15,939 కోట్ల పెనాల్టీలు వసూలు చేశాయి. అయితే, బేసిక్ సేవింగ్ ఖాతాలు, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలకు కనీస సగటు బాలన్స్ నిల్వవర్తించదు. ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు ఆంక్షలతో కూడుకుని ఉండటం చేత, ప్రజలు ఇతర సేవింగ్ అకౌంట్ను ఓపెన్ చేస్తున్నారు. బ్యాంకులు కూడా కనీస నిల్వ ఉండే అకౌంట్స్ మాత్రమే కస్టమర్స్ ఓపెన్ చేసేలా వ్యవహరిస్తున్నాయి. అలాగే, ఎస్ఎంఎస్ చార్జిల రూపంలో బ్యాంకులు వేలకోట్ల రూపాయలు విని యోగదారుల నుండి వసూలు చేస్తున్నాయి. గత మూడు ఆర్ధిక సంవత్సరాలలో యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా సుమారు 1188.14 కోట్ల రూపాయలు ఎస్ఎంఎస్ల రూపంలో వసూలుచేసింది. ఈ విషయం ప్రభుత్వానికి ఆర్బిఐకి తెలియనిదికాదు కానీ బ్యాంకులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. టెక్నాలజీ వలన బ్యాంకులు డిజిటల్ సేవలు అందిస్తున్నాయి. దీనివలన బ్యాంకులకు ‘మాన్ పవర్’ ఉపయోగం తగ్గింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బ్యాంకుల నిర్వహణ వ్యయం భారీగా తగ్గింది. ఒక వైపు బ్యాంకులకు రావద్దు. ఆన్లైన్ సేవలు వినియోగిం చుకోండి అని చెప్పే బ్యాంకులు, ఆయా ఆన్లైన్ సేవల పై కూడా అనవసరపు చార్జీలు వసూలు చేయడం విడ్డురంగా ఉంది.
ఎటిఎంల వినియోగ పరిమితి దాటితే
ఇక ఏ.టి.ఎం లావాదేవీలపై కూడా బ్యాంకులు అన వసరపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. మొదట బ్యాంకుని బట్టి ఎ.టి.ఎం రూల్స్ ఉండగా, ఇప్పడు కార్డుని బట్టి ఎ. టి.ఎం రూల్స్ ఉంటున్నాయి. ఫైనాన్సియల్ నాన్ ఫైనాన్సి యల్ ఏ.టి.ఎం వ్యవహారాలపై ఆంక్షలు పెట్టి పరిమితి దాటిన వారినుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. వినియో గదారులు ఎటిఎంల వినియోగ పరిమితి దాటితే సుమారు 23 రూపాయల పైననే ప్రతీ వ్యవహారానికి ఛార్జ్ చేస్తున్నా యి. మొదట్లో ఏటిఎంల ద్వారా ఎటుంటి చార్జీలు ఉండ వని తెలిపిన బ్యాంకులు రాను రాను ఏటీఎం వ్యవహారా లపై చార్జీలు విధించాయి. ఈ ఏ.టి.ఎం చార్జీల వలెనే ప్రజ లు యూ.పి.ఏ ప్రెమెంట్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో యూపిఏ ప్రెమెంట్స్ దేశంలో విపరీతంగా పెరి గాయి. అందుకే బ్యాంకులు యూపిఏ వ్యవహారాల మీద కూడా చార్జీలు వసూలు వసూలు చేయాలని భావిస్తున్నా యి. ఇటీవల యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ను విధిస్తూ రూపొందించిన యూపీఐ ట్రాన్సాక్షన్ చార్జీల బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో దేశ ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు. ఎంత మేరకు ఎండీఆర్ చార్జీలు విధిస్తారన్న దానిపై ఇప్పుడే స్పష్టత లేకపోయినప్ప టికీ, రూ.2 వేలకు మించిన లావాదేవీలపై 0.3శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్ను విధించే అవకాశం ఉన్నది. అయితే ఈచార్జీల భారం వ్యాపారులపైనే ఉండను న్నట్టు ప్రభుత్వవర్గాలు చెప్తున్నప్పటికీ, అంతిమంగా కొను గోలుదారుల పైనే భారం పడిపోతుంది. సేవలను వినియో గించినందుకు తగిన రుసుము వసూలు చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ ప్రతి చిన్న సేవకు వేర్వేరు పేర్లతో రుసుములు విధించడం ప్రజలకు ఆర్ధిక భారంగా మారు తోంది. వినియోగ దారులపై అధిక చార్జీల భారం తగ్గించిన ప్పుడే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బల పడుతుంది. అదే ఆర్థికసమ్మిళిత అభివృద్ధికి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిజమైన పునాది అవుతుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- 56% నెట్‌వర్క్‌ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- 4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- ఇరాన్ యుద్ధం ముగింపు పై ట్రంప్ కీలక ప్రకటన
- యూఏఈలో పెట్టుబడుల కోసం ఒడిశా సీఎం మాఝీ దూకుడు.. రూ.2.1 లక్షల కోట్ల ఒప్పందం
- వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!
- శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు
- యూఏఈ ఆర్థిక మంత్రితో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ భేటీ
- WHO ఆగ్నేయాసియా అధిపతి పదవికి సైమా వాజెద్ రాజీనామా







