56% నెట్‌వర్క్‌ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- September 10, 2026
యూఏఈ: దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే తన విమాన నెట్‌వర్క్‌లో 56 శాతం కార్యకలాపాలను పునరుద్ధరించగలిగిందని సంస్థ డిప్యూటీ ప్రెసిడెంట్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ తెలిపారు.
అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM)లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. యుద్ధం ప్రారంభానికి ముందు నెలల్లో ఎమిరేట్స్ సుమారు 4.7 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసినట్లు కాజిమ్ తెలిపారు. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన మార్గాలు, కార్యకలాపాలపై ప్రభావం పడినప్పటికీ.. పరిస్థితులకు అనుగుణంగా వేగంగా చర్యలు తీసుకుని కొద్ది రోజుల్లోనే నెట్‌వర్క్‌లో 56 శాతం కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఎమిరేట్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన అంతర్జాతీయ విమాన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో వాడీ అల్-బుహైర్ మూసివేయలేదు..!!
- కువైట్‌లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- ఒమన్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- 56% నెట్‌వర్క్‌ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- 4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- ఇరాన్ యుద్ధం ముగింపు పై ట్రంప్ కీలక ప్రకటన
- యూఏఈలో పెట్టుబడుల కోసం ఒడిశా సీఎం మాఝీ దూకుడు.. రూ.2.1 లక్షల కోట్ల ఒప్పందం
- వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!
- శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు







