ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!

- September 10, 2026 , by Maagulf
ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!

మక్కా: సౌదీ అరేబియాలో సముద్రంలో బోటు మొరాయించడంతో చిక్కుకుపోయిన ఇద్దరు బంగ్లాదేశీయులను బోర్డర్ గార్డ్‌ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి. మక్కా ప్రాంతంలోని రబీఘ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో బోటు పనిచేయకుండా నిలిచిపోవడంతో ఇద్దరు బంగ్లాదేశీయులు ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అనంతరం అవసరమైన సహాయాన్ని అందించారు.

సముద్ర ప్రయాణాలు చేసే వారంతా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సూచించింది. బోటులో ప్రయాణం ప్రారంభించే ముందు అది సముద్ర ప్రయాణానికి అనువుగా ఉందో లేదో పూర్తిగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు, సౌదీ అరేబియాలోని ఇతర ప్రాంతాల్లో 994కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com