కువైట్‌లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- September 10, 2026
కువైట్: అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై నలుగురు భారతీయులను కువైట్ భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దాలీ రోడ్డులోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మ్‌లో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రిమినల్ సెక్యూరిటీ అఫైర్స్ సెక్టార్‌కు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం, జహ్రా గవర్నరేట్ దర్యాప్తు విభాగం అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
దర్యాప్తులో ఓ ఫార్మ్‌ను స్థానిక మద్యం తయారీ, నిల్వ, విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం భద్రతా సిబ్బంది ఫార్మ్పై దాడి చేయగా.. మద్యం తయారు చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో వ్యక్తి అక్కడికి స్థానిక మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో అరెస్ట్ చేశారు. అతను కొనుగోలు చేసిన మద్యాన్ని తిరిగి విక్రయించేందుకు తీసుకెళ్లాలని భావించినట్లు అధికారులు తెలిపారు.
236 బాటిళ్ల మద్యం స్వాధీనం
దాడిలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 236 ప్లాస్టిక్ బాటిళ్ల స్థానిక మద్యం, పెద్ద సంఖ్యలో బ్యారెళ్లు, మద్యం తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, కొంత నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ఫార్మ్‌ను ప్రజలకు కనిపించకుండా స్థానిక మద్యం తయారీ, నిల్వ, విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. నాలుగో నిందితుడు మద్యం కొనుగోలు చేసి తిరిగి విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ముగ్గురిపై ఇప్పటికే కేసులు
దర్యాప్తులో అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు ఇప్పటికే అరెస్ట్ వారెంట్లు ఉన్న వ్యక్తులుగా తేలింది. వీరిలో కొందరిపై మోసం, వంచనకు సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న ఆ ఫార్మ్‌ను తొలగించేందుకు కువైట్ మున్సిపాలిటీతో సమన్వయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్‌లో డిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!







