అల్లు అర్జున్‌ కు 'ప్రవాసి రత్న పురస్కారం..

- August 20, 2016 , by Maagulf
అల్లు అర్జున్‌ కు 'ప్రవాసి రత్న పురస్కారం..

తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరిస్తూ.. స్టైలిష్‌స్టార్‌ అని అభిమానులతో పిలిపించుకుంటున్నారు టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా ఉంది. తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం కూడా కేరళలో విడుదలై విజయం సాధించింది. కేరళ వాసులు అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్‌ అని పిలుచుకుంటారు. కేరళనుంచి వెళ్లి దుబాయ్‌లో స్థిరపడినవారు ఇటీవల అల్లు అర్జున్‌ను 'ప్రవాసి రత్న పురస్కారంతో' సత్కరించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. వారికి ధన్యవాదాలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com