గల్ఫ్ ఈ-కామర్స్ పెట్టుబడుల్లో సౌదీ అరేబియా ఆధిపత్యం..!!
- September 11, 2026
రియాద్:గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల్లో ఈ-కామర్స్ రంగంలో సౌదీ అరేబియా తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. 2025 నాటికి గల్ఫ్ దేశాల్లో జరిగిన ఈ-కామర్స్ పెట్టుబడుల్లో సౌదీ వాటా ఏకంగా 93 శాతానికి చేరింది. 2021లో ఈ వాటా 46 శాతంగా ఉండగా.. నాలుగేళ్లలో భారీగా పెరిగింది. దీంతో సౌదీ అరేబియా ప్రాంతీయ ఈ-కామర్స్ హబ్‌గా ఎదుగుతున్నట్లు స్పష్టమవుతోంది. లండన్‌లో RLC గ్లోబల్ ఫోరం, సెల్ఫ్రిడ్జెస్ సంయుక్తంగా నిర్వహించిన ‘న్యూ జియోగ్రఫీ ఆఫ్ గ్రోత్’ సెషన్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ-కామర్స్‌కు ఇంకా భారీ అవకాశాలు
గల్ఫ్ రిటైల్ రంగంలో ఈ-కామర్స్ వినియోగం ప్రస్తుతం 11 శాతం మాత్రమే ఉందని సమావేశంలో వెల్లడించారు. అంటే రాబోయే సంవత్సరాల్లో ఈ రంగం మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ-కామర్స్ పెట్టుబడులు కేవలం ఆన్‌లైన్ రిటైల్‌కే పరిమితం కావడం లేదు. లాజిస్టిక్స్, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లోనూ పెట్టుబడులు పెరుగుతున్నాయి. GCC దేశాల్లో ఈ-కామర్స్ వృద్ధి ప్రపంచ సగటు కంటే వేగంగా కొనసాగుతున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు.
బలమైన దేశీయ డిమాండ్, భారీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయ మార్కెట్లకు పెరుగుతున్న అనుసంధానం కారణంగా ప్రపంచ లగ్జరీ గూడ్స్ మార్కెట్ భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రాంతంగా గల్ఫ్ ఎదుగుతోంది.RLC గ్లోబల్ ఫోరం చైర్మన్ పనోస్ లినార్డోస్ మాట్లాడుతూ.. వివిధ మార్కెట్లు, రంగాలు, కంపెనీల మధ్య వృద్ధి అవకాశాలు సమానంగా ఉండటం లేదన్నారు. పెట్టుబడులు కూడా మరింత ఎంపికతో కొనసాగుతున్నాయని తెలిపారు.
దేశీయ పెట్టుబడులకు ప్రాధాన్యం
బ్లూమ్‌బర్గ్ ఇంటెలిజెన్స్ సీనియర్ రిటైల్ అనలిస్ట్ డెబోరా ఐట్‌కెన్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే దాని రూపం మారుతోందన్నారు. పర్యాటక రంగం పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. దేశీయ పెట్టుబడులు, ప్రాంతీయ మూలధన వినియోగం మాత్రం పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







