ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- September 12, 2026
హైదరాబాద్: వ్యక్తిగతీకరించిన వైద్య సేవల భవిష్యత్తును మార్చే లక్ష్యంతో పనిచేస్తున్న హెల్త్‌కేర్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ **ఆయు ఏఐ (Aayu AI)**కు గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా నుంచి ప్రశంసలు, గో-టు-మార్కెట్ మద్దతు లభించింది. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా హెడ్ రాగిణి దాస్, ఆమె బృందానికి ఆయు ఏఐ తన ఉత్పత్తి, సాంకేతికతపై విస్తృత ప్రదర్శన ఇచ్చింది.
ఆయు ఏఐ వ్యవస్థాపకుడు శ్రీధర్ బెవరా నేతృత్వంలోని కోర్ ఇంజినీరింగ్ బృందం గంటకు పైగా జరిగిన ప్రత్యేక సెషన్‌లో ప్లాట్‌ఫామ్ సాంకేతికత, ఆర్కిటెక్చర్, సామర్థ్యాలను గూగుల్ బృందానికి వివరించింది. ప్రదర్శన సందర్భంగా గూగుల్ ఫర్ స్టార్టప్స్ బృందం పలు ప్రశ్నలు అడగడంతో పాటు విలువైన సూచనలు, అభిప్రాయాలను అందించింది. హెల్త్‌కేర్ సేవల రూపాంతరంలో ఆయు ఏఐ తీసుకురాగల ప్రభావంపై ప్రోత్సాహకరమైన స్పందన వ్యక్తం చేసింది.
గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా హెడ్ రాగిణి దాస్ ప్రదర్శన మొత్తం చర్చలో చురుగ్గా పాల్గొనడం ఆయు ఏఐ బృందానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించింది. ముఖ్యంగా ఆమెకు ఉన్న పారిశ్రామికవేత్తగా అనుభవం, జొమాటో ప్రారంభ దశలో పోషించిన కీలక పాత్ర నేపథ్యంలో ఆమె సూచనలు సంస్థకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆయు ఏఐ సీటీఓ, సహ వ్యవస్థాపకుడు సూర్య శేషాంక్ సంస్థ సాంకేతికత, ఇంజినీరింగ్ ఆర్కిటెక్చర్, ఎండ్-టు-ఎండ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణంపై గూగుల్ బృందానికి సమగ్ర వివరణ ఇచ్చారు. మరో సహ వ్యవస్థాపకుడు, పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ మురళీకృష్ణ తన విస్తృత రంగ అనుభవంతో సంస్థ సాంకేతికత, సామాజిక ప్రభావ వ్యూహానికి ప్రజారోగ్య కోణాన్ని అందిస్తున్నారు.
వైద్య సమాచారాన్ని ఒకే వేదిక పైకి..
వ్యవస్థాపకుడు, రచయిత, ఇన్నోవేషన్ అడ్వైజర్ శ్రీధర్ బెవరా స్థాపించిన ఆయు ఏఐ.. విభిన్నంగా ఉన్న వైద్య రికార్డులు, రోజువారీ ఆరోగ్య సమాచారాన్ని ఒక సమగ్ర, దీర్ఘకాలిక ‘హెల్త్ జర్నీ’గా అనుసంధానించే లక్ష్యంతో రూపొందించబడింది.
వైద్య చరిత్ర, లక్షణాలు, ఆహారం, ఫిట్‌నెస్, నిద్ర తదితర ఆరోగ్య సమాచారాన్ని ఒకచోట చేర్చి సందర్భానుసారమైన ఏఐ ఆధారిత విశ్లేషణలను అందించడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతగా సంస్థ పేర్కొంది. తద్వారా నివారణాత్మక వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు.. రోగి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులకు మరింత సమగ్ర సమాచారం అందించడంలో సహాయపడుతుందని తెలిపింది. దీనివల్ల నివారించగల వైద్య, నిర్ధారణపరమైన పొరపాట్లను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని సంస్థ వెల్లడించింది.
ఇటీవల మణిపాల్ హెల్త్ యాజమాన్యం, పెన్సిల్వేనియాలోని ప్రముఖ వైద్యులు, విజయ మెడికల్ సెంటర్, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కూడా ఆయు ఏఐ తన సాంకేతికతను ప్రదర్శించింది. ఆయా ప్రదర్శనలకు ప్రోత్సాహకరమైన స్పందన లభించినట్లు సంస్థ తెలిపింది.
ఆయు ఏఐ వ్యవస్థాపకుడు శ్రీధర్ బెవరా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా కలిసి సంస్థ విజన్, వ్యక్తిగతీకరించిన ఆరోగ్య సేవల అభివృద్ధిలో సాంకేతికత అందించగల అవకాశాలను వివరించారు. ప్రజా ప్రయోజనాల కోసం సాంకేతికత, ఆవిష్కరణలను వినియోగించాలన్న ముఖ్యమంత్రి విస్తృత దృక్పథంతో ఆయు ఏఐ లక్ష్యాలు అనుసంధానమవుతున్నాయని సంస్థ పేర్కొంది.
సెప్టెంబర్‌లో సేవలు ప్రారంభం
ఆయు ఏఐ ఇప్పటికే గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియాలో భాగంగా ఉండటంతో పాటు, బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో ఇంక్యుబేట్ అవుతోంది. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ 5 లక్షల అమెరికన్ డాలర్ల (US$500,000) నిధులను సమీకరించింది.
సెప్టెంబర్‌లో ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ సిద్ధమవుతోంది. ఇప్పటికే పలువురు ప్రారంభ వినియోగదారులను (Early Adopters) ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంస్థకు మహేశ్ అడ్వాణీ, రాకేశ్ బోహ్రా, హితేష్ భయానీ వంటి ఏంజెల్ ఇన్వెస్టర్లు మద్దతుగా ఉన్నారు.
“వ్యక్తిగతీకరించిన, ముందస్తు జాగ్రత్తలతో కూడిన, మరింత తెలివైన ఆరోగ్య సేవలను అందించడమే మా లక్ష్యం. ‘వన్ ప్లాట్‌ఫామ్. వన్ కంప్లీట్ హెల్త్ స్టోరీ’ అనే దృక్పథంతో ముందుకు సాగుతున్నాం” అని శ్రీధర్ బెవరా తెలిపారు.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్‌లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







