బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- September 12, 2026
మనామా: బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్ల వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు ఎంపీలు ప్రతిపాదించారు. 16 ఏళ్లలోపు పిల్లలు పబ్లిక్ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు నడపకుండా నిషేధం** విధించేలా ట్రాఫిక్ చట్టాన్ని సవరించాలని నలుగురు ఎంపీలు కోరుతున్నారు. ఎంపీలు ఖలీద్ బుఅనాక్, హిషామ్ అల్ అవాధి, జైనబ్ అబ్దులమీర్, అహ్మద్ అల్ సల్లూమ్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ-స్కూటర్ల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మరణాలు, తీవ్ర గాయాలు చోటుచేసుకోవడం.. పిల్లలు, పాదచారులకు ప్రమాదం పెరుగుతుండటమే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు.
16 ఏళ్లలోపు వారు నడిపితే?
ప్రస్తుతం బహ్రెయిన్ ట్రాఫిక్ చట్టంలో ఈ-స్కూటర్లకు ప్రత్యేక నిర్వచనం లేదా కనీస వయసు పరిమితి లేదు. 2014 నాటి ట్రాఫిక్ చట్టం మోటరైజ్డ్ వాహనాలను సాధారణంగా మాత్రమే నిర్వచిస్తోంది. ప్రతిపాదిత సవరణ ఆమోదమైతే 16 ఏళ్లలోపు వ్యక్తి పబ్లిక్ రోడ్డుపై ఈ-స్కూటర్ నడిపితే.. సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లుగా పరిగణిస్తారు. లైసెన్స్ లేకుండా మోటార్ వాహనం నడిపినందుకు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 100 నుంచి 500 బహ్రెయినీ దినార్ల జరిమానా, లేదా రెండింటిలో ఏదో ఒకటి విధించే అవకాశం ఉంది.
అంతేకాకుండా, లైసెన్స్ పొందే వయసు రాకముందే వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి లైసెన్స్ జారీని కోర్టు వాయిదా వేయవచ్చు. సాధారణంగా ఈ వాయిదా నిర్దేశిత వయసు వచ్చిన తర్వాత ఆరు నెలల వరకు ఉండొచ్చు. పునరావృత ఉల్లంఘనల్లో మరింత కాలం పొడిగించే అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం ఈ-స్కూటర్లకు సంబంధించి పలు అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రికి ఇవ్వనున్నారు. ఈ-స్కూటర్లు నడపడానికి అనుమతించే ప్రాంతాలు, గరిష్ఠ వేగ పరిమితులు, భద్రతా నిబంధనలు, పర్మిట్లకు సంబంధించిన నిబంధనలు వంటి అంశాలను నిర్ణయించనున్నారు.
పిల్లలు, పాదచారుల భద్రతే లక్ష్యం
పిల్లలకు రోడ్డు పరిస్థితులపై తగిన అవగాహన, అనుభవం లేకపోవడం వల్ల కార్లు, ఇతర వాహనాల మధ్య ఈ-స్కూటర్లు నడపడం ప్రమాదకరమని ఎంపీలు పేర్కొన్నారు.అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఈ-స్కూటర్ రైడర్లకు రక్షణ చాలా తక్కువగా ఉంటుందని బిల్లుకు సంబంధించిన వివరణలో తెలిపారు. స్కూటర్ల పరిమాణం చిన్నగా ఉండటం వల్ల కార్లు ఢీకొనే ప్రమాదం లేదా రోడ్డుపై పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లు, నివాస ప్రాంతాలు, వినోద ప్రదేశాల్లో ఈ-స్కూటర్లు నడపడం వల్ల పాదచారులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని ఎంపీలు తెలిపారు.
చట్టంలో తొలిసారి ఈ-స్కూటర్లకు ప్రత్యేక గుర్తింపు
కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యుత్‌తో, విద్యుత్‌తో పాటు రైడర్ శక్తితో లేదా ఇతర యాంత్రిక శక్తితో నడిచే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీల్స్ వాహనాలను ఈ-స్కూటర్లుగా పరిగణించనున్నారు. నిలబడి లేదా ఇలాంటి భంగిమలో ప్రయాణించే వ్యక్తుల కోసం రూపొందించిన, ఎలక్ట్రిక్ సైకిళ్ల కంటే చిన్నగా, తక్కువ శక్తితో పనిచేసే వాహనాలు కూడా వీటి పరిధిలోకి వస్తాయి. పెరుగుతున్న ఈ-స్కూటర్ల వినియోగం, నమోదవుతున్న తీవ్రమైన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ చట్టంలో మార్పులు అవసరమని ఎంపీలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- బిగ్ టికెట్లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!
- కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్లో కీలక చర్చలు..!!
- రాస్ అల్ ఖైమాలో బీచ్ బార్బెక్యూపై నిషేధం..!!
- కువైట్ తీరాలకు తరలివస్తున్న ఫ్లెమింగోలు..!!
- విద్యార్థుల రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఒమన్‌లో దారుణం.. తల్లిపై కత్తితో దాడి..!!
- హైదరాబాద్ కెప్టెన్ గా సిరాజ్
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు







