కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్‌లో కీలక చర్చలు..!!

- September 12, 2026 , by Maagulf
కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్‌లో కీలక చర్చలు..!!

దోహా: ఖతార్ ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ.. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జార్రాహ్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ పరిణామాలపై కీలకంగా చర్చించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలతో పాటు.. ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొనసాగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు, సమన్వయ చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు.

ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు దౌత్యపరమైన చర్చలు, వివిధ శాంతి ప్రయత్నాలకు ఖతార్ మద్దతు కొనసాగుతుందని షేక్ మొహమ్మద్ స్పష్టం చేశారు. అలాగే సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలకు హామీ కల్పించే పరిష్కారం, అనంతరం ప్రాంతంలో శాశ్వత శాంతికి సమగ్ర ఒప్పందం కుదిరేలా చేసే దౌత్య ప్రయత్నాలకు ఖతార్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖతార్, కువైట్ మధ్య ఈ ఫోన్ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com