ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- September 12, 2026
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ప్యారడైజ్‌కు ఎంతమంది ఫైట్ మాస్టర్స్ పనిచేశారు?
మేము, నవకాంత్, రియల్ సతీష్ పనిచేశాం.ఇందులో మేం రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేశాం.
నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
నాని గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. రెండు జడలు వేసుకున్న హీరోను ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడలేదు. మాకు కూడా అది చాలా కొత్తగా అనిపించింది. నాని ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
-నాని ఈ స్థాయిలో యాక్షన్ చేయడం ఇదే మొదటిసారి. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయి. ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉంటుంది.
-జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం మామూలు విషయం కాదు. యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ జడలు రూప్‌లకు, ముఖానికి తగులుతుంటాయి. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయడం మాకు కూడా కొత్త అనుభవమే. మా అసిస్టెంట్‌కు కూడా అలాంటి జడలు వేయించి అందులో ఉండే కష్టం తెలుసుకుని మరీ యాక్షన్‌ను కంపోజ్ చేశాం.
-నాని గారి కెరీర్లోనే ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు.ప్రతి విషయంలో తన 100 శాతం కష్టపడ్డాడు. ఎన్ని టేక్స్ అయినా చేయాలని మనసులో ఫిక్స్ అయ్యాడు. నిజంగా నాని ఇంత కష్టపడతాడని మేం ఊహించుకోలేదు. అంత గొప్పగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు.
-నాని బేర్ బాడీతో చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. అవి స్క్రీన్‌పై చేయడం అంత ఈజీ కాదు. బాడీ బిల్డింగ్ చేయాలి. డైటింగ్‌లో ఉండాలి. ఇందులోనూ దర్శకుడు శ్రీకాంత్ తనకు అనుకున్నది వచ్చేంతవరకు రాజీపడరు. శ్రీకాంత్ తీసుకున్న విజన్‌కు నాని 100 శాతం న్యాయం చేశారు. అందులో మేం భాగమవడం అదృష్టంగా భావిస్తున్నాం.
యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?
-మా యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి దాదాపు పది రోజులు పట్టింది. ఇందులో కొత్త మనుషులు, కొత్త బాడీ లాంగ్వేజ్.. అంతా కొత్తగానే ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న కథ సహజంగానే యాక్షన్‌ను డిమాండ్ చేస్తుంది. ఇందులో తప్పించుకోవడానికి అవకాశం ఉండదు.. ఫైట్ చేయాల్సిందే. అలాంటి పరిస్థితిని శ్రీకాంత్ క్రియేట్ చేశారు.
-యాక్షన్‌ను కంపోజ్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఇలాంటి బాడీ లాంగ్వేజ్‌తో సినిమా ఇంతకుముందు రాలేదు. అందుకే చాలా కేర్ తీసుకుని చేశాం. ఇందులో చాలా రిస్కీ యాక్షన్ ఉంటుంది. షూటింగ్ సమయంలో మా యూనిట్లో ఒకరికి గాయం కూడా అయింది.
మోహన్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-మోహన్ బాబు చాలా సినిమాలు చేశారు. కానీ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయనకూ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి.
కొత్త ఫైట్ మాస్టర్స్ వస్తున్నప్పుడు కాంపిటీషన్‌గా ఫీల్ అవుతారా?
-కాంపిటీషన్ ఉన్నప్పుడే క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంకా ఎలా కొత్తగా చేయాలనే తపన వస్తుంది. మేం ప్రతిరోజూ తొలి సినిమా చేస్తున్న ఫైట్ మాస్టర్స్‌లా భయంతో, వృత్తి పట్ల నిజాయితీతో, ఏకాగ్రతతో పనిచేస్తుంటాం.
టెక్నికల్ టీం గురించి?
దర్శకుడు శ్రీకాంత్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. కెమెరామెన్ సాయి కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. ఇందులో లొకేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. అందులో వాడిన పరికరాలు కూడా కొత్తగా ఉంటాయి.అనిరుద్ మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది.
-మా అబ్బాయి కూడా ‘ప్యారడైజ్’లో పనిచేశాడు. తనకు అన్ని భాషల సినిమాలపై మంచి పట్టు ఉంది.
నిర్మాత సుధాకర్ గురించి?
- సుధాకర్ ఎక్కడా రాజీపడకుండా భారీగా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించారు. నాని, దర్శకుడిపై పూర్తి నమ్మకంతో ముందుకెళ్లారు. నాని, నిర్మాత, దర్శకుడు కలిసి ‘ప్యారడైజ్’ను బిగ్ స్కేల్ లో చేశారు.ఈ సినిమాకి అద్భుతమైన విజయం తప్పకుండా దక్కుతుందని మేం నమ్ముతున్నాం.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







