ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!

- September 13, 2026 , by Maagulf
ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!

కువైట్ :కువైట్ నేవీ లైవ్ అమ్యూనిషన్ డ్రిల్ నిర్వహించనుంది. ఫైలాకా దీవి సమీపంలోని ఫైరింగ్ రేంజ్‌లో ఈ సైనిక విన్యాసాలు సెప్టెంబర్ 13 నుంచి 30 వరకు కొనసాగుతాయని కువైట్ ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ ఆర్మీ మోరల్ గైడెన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ కీలక సూచనలు చేసింది. సముద్రంలోకి వెళ్లే పౌరులు, నివాసితులు డ్రిల్ కోసం నిర్దేశించిన ప్రాంతానికి సమీపంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.మందుగుండు సామగ్రితో సైనిక విన్యాసాలు జరుగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయించిన ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com