ఖతార్‌లో మరింత సులభంగా డొమెస్టిక్ వర్కర్ నియామకం..!!
- September 13, 2026
దోహా: ఖతార్‌లో డొమెస్టిక్ వర్కర్లను నియమించుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ Moawen పేరుతో కొత్త ఈ-ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలతో ఆన్‌లైన్‌లో వ్యవహరించడంతో పాటు, నియామక దరఖాస్తు పురోగతిని కూడా ట్రాక్ చేసుకోవచ్చు.
Moawen ద్వారా 11 దశలలోడొమెస్టిక్ వర్కర్ ను సులభంగా నియమించుకోవచ్చు.
1. రిక్రూట్‌మెంట్ వీసా అనుమతి పొందాలి:ముందుగా **Metrash** ద్వారా రిక్రూట్‌మెంట్ వీసాకు అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే అనుమతి ఉంటే ఈ దశ అవసరం లేదు.
2. Moawenలో లాగిన్ అవ్వాలి: అనుమతి కోసం దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ఆ అనుమతి Moawen ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తుంది.
3. ‘Start your recruitment journey’ ఎంచుకోవాలి: Moawenలోకి వెళ్లి ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4. వివరాలు నమోదు చేయాలి: అవసరమైన వ్యక్తిగత వివరాలతో పాటు, గృహ కార్మికుడి నియామకానికి సంబంధించిన అవసరాలను నమోదు చేయాలి.
5. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ఆఫర్లు పరిశీలించాలి:లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు సమర్పించిన ఆఫర్లను పరిశీలించి, తగినదాన్ని ఎంచుకోవాలి.
6. కార్మికుడితో ఇంటర్వ్యూ: ఎంపిక చేసిన గృహ కార్మికుడితో ఇంటర్వ్యూను షెడ్యూల్ చేసుకోవచ్చు.
7. నియామక వివరాలు ఖరారు చేయాలి: రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నియామకానికి సంబంధించిన వివరాలను ఖరారు చేసి, ఖర్చుపై అంగీకారానికి రావాలి.
8. ఒప్పందంపై సంతకం చేయాలి: కాంట్రాక్ట్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాత దానిపై సంతకం చేయాలి.
9. ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి: రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఫీజులను డిజిటల్ విధానంలో చెల్లించాలి.
10. వీసా, Qatar Visa Center అపాయింట్‌మెంట్: Metrashలోకి లాగిన్ అయి వీసా జారీ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం Qatar Visa Center (QVC)\లో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ అవుతుంది. ఆ అపాయింట్‌మెంట్ వివరాలను Moawenలో నమోదు చేయాలి.
11. QID వివరాలు ఆటోమేటిక్‌గా వస్తాయి: Metrash ద్వారా గృహ కార్మికుడి రెసిడెన్స్ పర్మిట్ జారీ అయిన తర్వాత, అతని/ఆమె QID వివరాలు Moawen ప్లాట్‌ఫామ్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి.అనంతరం కార్మికుడు కతార్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు.
భవిష్యత్తులో మరిన్ని సేవలు
Moawen ప్లాట్‌ఫామ్ సేవలను భవిష్యత్తులో మరింత విస్తరించాలని కార్మిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా గృహ కార్మికులు కూడా ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ అయి తమ ఉద్యోగ నిబంధనలు, ఒప్పంద వివరాలు, ఇతర సమాచారాన్ని నేరుగా చూసుకునే అవకాశం కల్పించనున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!
- ఖతార్‌లో మరింత సులభంగా డొమెస్టిక్ వర్కర్ నియామకం..!!
- ఒమన్–అమెరికా జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం..!!
- ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం







