ఒమన్–అమెరికా జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం..!!
- September 13, 2026
వాషింగ్టన్: ఒమన్, అమెరికా మధ్య 18వ జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం వాషింగ్టన్లో జరిగింది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, పరస్పర రక్షణ సమన్వయాన్ని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఒమన్ తరఫున రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ డాక్టర్ మహమ్మద్ నాసర్ అల్ జాబీ నేతృత్వం వహించారు. ఆయన ప్రస్తుతం అధికారిక పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నారు.
అమెరికా తరఫున మధ్యప్రాచ్య వ్యవహారాల రక్షణ శాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖేల్ డిమినో సమావేశానికి నాయకత్వం వహించారు. సమావేశంలో అజెండాలోని పలు అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ముఖ్యంగా సైనిక సహకారం, పరస్పర రక్షణ సమన్వయం, ద్వైపాక్షిక భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అమెరికాలో ఒమన్ రాయబారిగా ఉన్న తలాల్ బిన్ సులైమాన్ అల్ రహ్బీతో పాటు ఇరు దేశాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సీనియర్ సైనిక అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







