త్వరలో జోఈజీ యాప్ గల్ఫ్‌లో ఉద్యోగాల కోసం...
- August 20, 2016
అరబ్‌దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన ఎంతో మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జోఈజీ సొ ల్యూషన్ సంస్థ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన స మావేశంలో జోఈజీ సొల్యూషన్స్ ప్రతినిధి స్పంద న, ఐడీయన్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ వర్దన్ కలిసి వివరాలు వెల్లడించారు. ఐడీయన్ వెంచర్స్ సహాయ సహకారాలతో ఈ యాప్‌ను అం దుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పందన తెలిపారు. స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలతో పాటు ఇండ్లలో పని మనుషులు, డ్రైవర్లు లాంటి ఉద్యోగులను కూడా ఈ యాప్ ద్వారా యజమానులు ఎంచు కోవచ్చని చెప్పారు.యాప్‌లో సంబంధిత వ్యక్తుల పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతామని, ఎవరి సేవలైతే తమకు అవసరమో యజమాను లే వారి వివరాలను తెలుసుకోవచ్చని వివరించా రు. యజమానులకు, నిరుద్యోగులకు మధ్య ఈ యాప్ వారధిగా పని చేస్తుందన్నారు. ఆయా దేశాల్లోని ఎంబసీలతో కలిసి పనిచేస్తామన్నారు. త్వరలోనే ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.జోఈజీ సొల్యూషన్ స్టార్ట ప్‌ను లక్షా యాభై వేల డాలర్ల ఫండ్ కింద పెట్టామని అశోక్ వర్దన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







