హజ్ యాత్ర నేటి నుంచి...
- August 20, 2016
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర మక్కా హజ్ యాత్ర ఆదివారం ప్రారంభం కానుంది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఉదయం పది గంటలకు హైదరాబాద్ హజ్ హౌస్ నుంచి తొలి బృందానికి జెండా ఊపి యాత్ర ప్రారంభించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ నుంచి ఎయిరిండియా తొలి ఫ్లైట్ సౌదీ అరేబియాలోని జెద్దాకు బయలు దేరనుంది. సీఎం కేసీఆర్ ఈ నెల 22న హజ్ హౌస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని హజ్ యాత్రికుల మూడో బృందాన్ని సాగనంపనున్నారుహజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా 15 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీ యాత్రికుల కోసం ప్రతి రోజు రెండు విమానాల చొప్పున ఈ నెల 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. తొలి ఎనిమిది విమానాల్లో తెలంగాణ, తర్వాతి నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్ యాత్రికులు బయలు దేరుతారు. మరో రెండు విమానాల్లో రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులు, చివరి విమానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వెయిటింగ్ జాబితా యాత్రికులు బయలుదేరుతారు. ఒక్కో విమానంలో 340 యాత్రికులు వెళ్లనున్నారు. హజ్ ప్రార్థనల అనంతరం అక్టోబర్ 4 నుంచి 11 వరకు మదీనా నుంచి బయలు దే రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రం నుంచి 2,800 మంది.. తెలంగాణ నుంచి హజ్ యాత్రకు దాదాపు 2,800 మంది యాత్రికులు బయలు దేరనున్నారు. మక్కాలోని నిజాం రుబాత్‌లో సుమారు 678 మందికి ఉచిత భోజన, వసతి సౌకర్యం లభించనుంది. యాత్రికులకు సేవలందించేందుకు ప్రతి 200 మంది కి ఓ ఖాదీముల్ హుజ్జాజ్(ప్రభుత్వ వలంటీర్)లను ఎంపిక చేశారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో హజ్ క్యాంప్ రెండ్రోజుల ముందే ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







