కువైట్‌లో 500 కిలోల పాడైన చేపలు సీజ్.. 16 మంది అరెస్ట్..!!
- September 15, 2026
కువైట్: కువైట్‌లోని అహ్మదీ గవర్నరేట్‌లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో భారీగా కుళ్లిన చేపలు పట్టుబడ్డాయి. అధికారులు 500 కిలోల కుళ్లిన చేపలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. నిబంధనలు ఉల్లంఘించిన, వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న 16 మందిని అరెస్ట్ చేశారు. అహ్మదీ గవర్నరేట్‌లోని సెక్యూరిటీ డైరెక్టరేట్స్ అఫైర్స్ సెక్టార్ ఆధ్వర్యంలో కువైట్ మున్సిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సహకారంతో ఈ సంయుక్త తనిఖీలు నిర్వహించారు.
చేపలు, కూరగాయల మార్కెట్‌తో పాటు అల్ కౌట్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతాలను అధికారులు లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా 16 మంది వాంటెడ్, నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుర్తింపు పత్రాలు చూపించలేని 22 మందిని గుర్తించారు. వాంటెడ్‌గా ఉన్న 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 28 కేసులు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన 500 కిలోల కుళ్లిన చేపలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వ్యక్తులు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత అధికారుల ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల ఆరోగ్య భద్రత, చట్ట నిబంధనల అమలులో భాగంగా ఇలాంటి సంయుక్త తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ దక్షిణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఎత్తివేత..!!
- డిసెంబర్ 10 నుంచి రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!
- దోహా ఎయిర్‌పోర్టులో ‘ఫాస్ట్ పాస్’.. అర్హత? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఒమన్‌లో అధిక బరువు లేదా ఊబకాయం డేంజర్ బెల్స్..!!
- ఏడు ఎమిరేట్లను కలుపుతూ యూఏఈ గ్రాండ్ టూర్..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో 5 నిమిషాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..!!
- బహ్రెయిన్‌లో ఆరు డ్రగ్స్ కేసులు.. 10 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో 500 కిలోల పాడైన చేపలు సీజ్.. 16 మంది అరెస్ట్..!!
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్







