ఒమన్‌లో అధిక బరువు లేదా ఊబకాయం డేంజర్ బెల్స్..!!
- September 15, 2026
మస్కట్: ఒమన్‌లో పెద్దలలో అధిక బరువు, ఊబకాయం సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన 2025 నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ జాతీయ సర్వే ప్రకారం.. ఏకంగా 64.7 శాతం మంది పెద్దలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు వెల్లడైంది. ప్రజల్లో దీర్ఘకాలిక వ్యాధుల వ్యాప్తి, వాటికి సంబంధించిన ప్రమాద కారకాలను అంచనా వేసేందుకు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో ఈ జాతీయ సర్వే నిర్వహించింది.
మారుతున్న ఆహారపు అలవాట్లే కారణం
ఊబకాయం పెరగడానికి మారుతున్న ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్ వినియోగం పెరగడం*, శారీరక శ్రమ తగ్గిపోవడం ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల టర్కియేలోని ఇస్తాంబుల్‌లో జరిగిన 33వ యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీలో డాక్టర్ అమీरा అల్ ఖరూసీ ఈ వివరాలను వెల్లడించారు. ఒమన్ జనాభాలో దాదాపు 30 శాతం మంది అధిక బరువుతో ఉన్నారని.. ఊబకాయాన్ని కూడా కలిపితే ఈ సంఖ్య 60 శాతానికి మించుతుందని తెలిపారు. పిల్లల్లోనూ శారీరక చురుకుదనం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతూ వ్యాయామానికి దూరమవుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని, భవిష్యత్తులో ఇది అధిక బరువు సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
WHO STEPwise సర్వే ప్రకారం.. ఒమన్ పౌరుల్లో ఊబకాయం శాతం ప్రవాసులతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఒమన్ పౌరులు 35.2 శాతం, ప్రవాసులలో 19 శాతం ఉబకాయులు ఉన్నారు. ఒమన్ మహిళలు ఊబకాయం సమస్యతో పురుషుల కంటే ఎక్కువగా ప్రభావితమవుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఒమన్ మహిళలు 40.9 శాతం, ఒమన్ పురుషులు 28.2 శాతంగా ఉంది.
అధిక బరువు, ఊబకాయం అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆరోగ్యకరమైన బరువును సాధించేందుకు చిన్న చిన్న మార్పులు చేసినా దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ దక్షిణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఎత్తివేత..!!
- డిసెంబర్ 10 నుంచి రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!
- దోహా ఎయిర్‌పోర్టులో ‘ఫాస్ట్ పాస్’.. అర్హత? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఒమన్‌లో అధిక బరువు లేదా ఊబకాయం డేంజర్ బెల్స్..!!
- ఏడు ఎమిరేట్లను కలుపుతూ యూఏఈ గ్రాండ్ టూర్..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో 5 నిమిషాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..!!
- బహ్రెయిన్‌లో ఆరు డ్రగ్స్ కేసులు.. 10 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో 500 కిలోల పాడైన చేపలు సీజ్.. 16 మంది అరెస్ట్..!!
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్







