డిసెంబర్ 10 నుంచి రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!

- September 15, 2026 , by Maagulf
డిసెంబర్ 10 నుంచి రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ప్రతిష్ఠాత్మక రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2026 డిసెంబర్ 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ మేరకు లిటరేచర్, పబ్లిషింగ్ అండ్ ట్రాన్స్‌లేషన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. స్థానిక, అంతర్జాతీయ ప్రచురణకర్తల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది.  సౌదీ అరేబియాలో ప్రతి ఏడాది నిర్వహించే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ పుస్తక ప్రదర్శన ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం, ప్రచురణ, అనువాద రంగాలకు చెందిన ప్రచురణకర్తలు, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కమిషన్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ప్రచురణకర్తలు తమ తాజా సాహిత్య, మేధో రచనలను ప్రదర్శించేందుకు ఇది వేదికగా నిలవనుంది. అదే సమయంలో రచయితలు, విద్యావేత్తలు, నిపుణులతో చర్చా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.

పిల్లలు, యువత కోసం ప్రత్యేకంగా ‘చిల్డ్రన్స్ పావిలియన్’ ఏర్పాటు చేయనున్నారు. బాల సాహిత్యం, యువత కోసం పుస్తకాలతో పాటు ఇంటరాక్టివ్ కార్యక్రమాలు, సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు.  పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, ఊహాశక్తిని అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యంగా ఉండనుందని నిర్వాహకులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com