సౌదీ దక్షిణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఎత్తివేత..!!

- September 15, 2026 , by Maagulf
సౌదీ దక్షిణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఎత్తివేత..!!

రియాద్: సౌదీ అరేబియాలోని దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో జారీ చేసిన అత్యవసర హెచ్చరికలను సౌదీ సివిల్ డిఫెన్స్ సోమవారం ఎత్తివేసింది. నాలుగు ప్రాంతాలు, నగరాల్లో తాత్కాలికంగా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అనంతరం.. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణంలోని జజాన్, నజ్రాన్ ప్రాంతాలతో పాటు అసీర్ ప్రాంతంలోని ఖమీస్ ముషైత్ గవర్నరేట్, అబ్హా నగరంలో ప్రమాదం తొలగిపోయినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రకటించింది. అయితే ప్రజల భద్రత కోసం అధికారుల సూచనలు, మార్గదర్శకాలను కొనసాగిస్తూ పాటించాలని సివిల్ డిఫెన్స్ ప్రజలను కోరింది.

డ్రోన్లు, క్షిపణి దాడుల నేపథ్యంలో హెచ్చరికలు

యెమెన్‌కు చెందిన హౌతీ మిలీషియా జరిపినట్లు పేర్కొన్న వరుస సరిహద్దు దాటి డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు అలర్ట్‌లు, మొబైల్ నోటిఫికేషన్లు పంపించి.. ఇళ్లలో లేదా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు. పౌరులు, ప్రవాసులు అధికారిక సూచనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com