హీరో సంపూర్ణేష్ బాబుతో మాగల్ఫ్ ముఖాముఖీ
- September 15, 2026
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
బిర్యాని క్యారెక్టర్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశారు కదా?
-డైరెక్టర్ శ్రీకాంత్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిసాను. అందులో బిర్యాని క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు. చాలా సీరియస్ గా ఉంటుంది.ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పాత్రలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది .
-ఇందులో నానికి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా త్రూ అవుట్ నా క్యారెక్టర్ ఉంటుంది.
మీరు కామెడీ నుంచి ఒక్కసారి ఇలాంటి సీరియస్ రోల్ చేయడం ఎలా అనిపించింది?
-మూడు సంవత్సరాల క్రితం నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చి ఉంటే నా కెరీర్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ జరిగేవికావు. నాని అన్న,శ్రీకాంత్ తో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-నేను ఇంత పెద్ద సినిమా ఎప్పుడు చేయలేదు. నా మీద మేకర్స్ చాలా నమ్మకం పెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నా వంతు కృషి చేశాను.
నానితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నాని నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు.ఇంత పెద్ద సినిమాలో ఇన్ని రోజులు పనిచేయడం నాకు ఇదే మొదటిసారి. షూటింగ్ సెట్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని డెడికేషన్ అద్భుతం. నేను ఏదైనా చక్కగా పర్ఫార్మ్ చేస్తే మెచ్చుకునేవారు.
ఈ ఆఫర్ రావడం వెనుక సాయి రాజేష్ ఉన్నారు అని విన్నాం?
-అవునండి. నాకు సాయి రాజేష్ ఫోన్ చేసి నీకు శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది చక్కగా మాట్లాడి క్యారెక్టర్ చేయమని చెప్పారు. సాయి రాజేష్ గారు శ్రీకాంత్ చాలా మంచి ఫ్రెండ్స్.
మీరు మోహన్ బాబు బ్యానర్ లో ఒక సినిమా చేశారు.. ఇప్పుడు ఆయనతో కలిసి నటిస్తున్నారు ఎలా అనిపిస్తుంది?
-చాలా హ్యాపీ అండి. నేను మోహన్ బాబుతో నటించడానికి చాలా కాలం ఎదురు చూశాను. ఇందులో మా కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పటినుంచో ఉన్న కల నెరవేరినట్టుగా అనిపించింది.
క్యారెక్టర్ చేయడానికి ఫిజికల్‌గా ఎలాంటి ఛాలెంజ్ ఎదుర్కొన్నారు?
-ఈ పాత్ర కోసం బరువు తగ్గమని చెప్పారు. తగ్గాను. అలాగే జట్టు గడ్డం కూడా పెంచాను. డైరెక్టర్ ఏం చెప్తే అది ఫాలో అయ్యాను.
-ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఏ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ, ఈ సినిమా పూర్తి అయ్యే వరకు ఏదీ చేయనని చెప్పాను.
అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ప్యారడైజ్ బిర్యానీ ఎంత అద్భుతంగా వుంటుందో సినిమా అంత అద్భుతంగా వుంటుంది. అంతకంటే అద్భుతంగా నా క్యారెక్టర్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మీరు సెప్టెంబర్ 24న చూస్తారు. (నవ్వుతూ)
-డైరెక్టర్ శ్రీకాంత్ ప్రతి క్యారెక్టర్‌ని చాలా క్లారిటీతో డిజైన్ చేశారు. ఇందులో ప్రతి సీన్‌కి, క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ అద్భుతంగా వుంటాయి.
-‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’ రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ‘యేషా నాగుల కట్ట’, ‘ఆయా షేర్’ పాటలే వినిపిస్తున్నాయి.
నిర్మాత సుధాకర్ గురించి?
-ప్రొడ్యూసర్ చాలా కంఫర్ట్‌గా చూసుకున్నారు. సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. వరల్డ్ బిల్డింగ్ చాలా అద్భుతంగా వుంటుంది.
-రెమ్యూనరేషన్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు అన్నిటికంటే ఇందులోనే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నాను.
కొత్త సినిమాల గురించి?
-నాకు డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది. త్వరలోనే ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రకటన ఉంటుంది.
తాజా వార్తలు
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
- తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి ‘మాన్సోరీ ఫెరారీ 812’
- సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో షేక్ మహమ్మద్ భేటీ
- మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- ఏఐ న్యాయమూర్తి మనస్సాక్షిని, న్యాయ విచక్షణను భర్తీ చేయలేదు: జస్టిస్ సురేపల్లి నందా
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి







