ఉత్తర రాజ్యములో రద్దు కాబడిన వాహనాలు తొలగించాలని పౌరులకు సూచన
- August 21, 2016
మనామా: రద్దు కాబడిన వాహనాలను తొలగించడానికి ఒక అధికారిక ప్రచారం ఉత్తర రాజ్యంలో తదుపరి కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఉత్తర రాజ్యములో వివిధ ప్రాంతాల్లో గత కొన్ని నెలలలో తుక్కు వాహనాలని తొలగించాలని వాహన యజమానులను మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మహమ్మద్ బుహమూద్ కోరారు. వారు అలా చేయని పక్షంలో మున్సిపాలిటీ త్వరలో వాటిని తొలగించే పనిని ముమ్మరం చేస్తుందని తెలిపారు.సల్మాబాద్ , హమద్ టౌన్, హామాలా , జాంబియా మరియు ఇతర ప్రాంతాలలోని రద్దు వాహనాలు యొక్క పెరుగుదల సంబంధించి అనేక ఫిర్యాదులు అందుకొన్న తర్వాత ఈ ప్రకటన శనివారం వెలువడింది. ఉత్తర మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ యూసీఫ్ అల్ ఘటం ఈ సందర్భంగా మాట్లాడుతూ , రద్దు కాబడిన వాహనాలను తొలగించక నిబంధనలను ఉల్లంఘించినవారిపై వారి వాహనాలు తొలగించడానికి కొన్ని రోజుల వ్యవధి ఇస్తున్నట్లుగా వారికి నోటీసు సైతం ఇవ్వబడింది " అని ఆయన అన్నారు . మునిసిపాలిటీ వర్క్స్ యొక్క నిర్దేశకాల ప్రకారం, పురపాలక వ్యవహారాల అర్బన్ ప్లానింగ్ మంత్రి ఇస్సామ్ ఖలాఫ్, ప్రచారం తరువాత కొద్ది రోజుల్లో మొదలవుతుంది. " ఉత్తర గవర్నేట్ వివిధ ప్రాంతాల్లో 1,000 రద్దు వాహనాలు కంటే ఎక్కువగా ఉన్నట్లు 2016 మొదటి అర్ధ భాగం లో కనుగొనబడిందని ఆయన తెలియజేసారు . మున్సిపాలిటీ రద్దు వాహనాలు సేకరించడానికి ఒక బహిరంగ స్థలం సైతం సిద్ధం చేసినట్లు అల్ ఘటం సమాచారం ఇచ్చారు.. " యజమానులు తమ వాహనాలను తీసుకువెళ్లాలంటే, మున్సిపాలిటీ జరిమానాలు, తొలగింపు ఖర్చులు చెల్లించిన తరువాత వారి వారి వాహనాలు తిరిగి తీసుకువెళ్లేందుకు అనుమతిస్తారు.."ఈ తరహా ప్రచారాలు గత కొన్ని సంవత్సరాలలో ప్రవేశపెట్టబడటం గమనార్హం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







