రియో పతక విజేతలైన సింధు, సాక్షి మాలిక్ లకు దుబాయ్ నిర్వాసిత వ్యాపారి భారీ నజరానా
- August 21, 2016
దుబాయ్: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి.. భారతదేశ ఖ్యాతిని ప్రపంచపటంలో చాటిన షట్లర్ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్‌లకు దుబాయిలోని ఓ భారత వ్యాపారి 7. 5 మిలియన్ల ( 410,305 డి హెచ్ ) భారీ నజరానా ప్రకటించారు. సింధుకు రూ.5 మిలియన్లు , సాక్షి మాలిక్ కు రూ.2. 5 మిలియన్లు చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వ్యాపారి ముక్కత్తు సెబాస్టియన్ " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు.కేరళలోని కొట్టాయంకు చెందిన సెబాస్టియన్ గత నలభై ఏళ్లుగా యూఏఈలో స్థిరపడ్డారు. దుబాయిలో ముక్కదాన్ ప్లాంటేషన్‌తో పాటు, బెంగళూరులో ఆటోబన్‌కార్ రెంటల్స్ వ్యాపారం చేస్తున్నారు. రియోలో భారత క్రీడాకారిణిలు సింధు, సాక్షి పతకాలు సాధించడం పట్ల సెబాస్టియన్ హర్షం వ్యక్తం చేశారు. వారిని చూస్తే గర్వంగా ఉందని.. అందుకే ఇలా నగదు బహుమతితో వారిని సత్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేగాక.. కోచిలో ఓ కార్యక్రమం ఏర్పాటుచేసి ఒలింపిక్ విజేతలను సన్మానించాలని భావిస్తున్నట్లు సెబాస్టియన్ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







